- Neti Charithra
Breaking.. ఆరేళ్ళ బాలిక పై ఆటో డ్రైవర్ అత్యాచారం..చిత్తూరు జిల్లా లో దారుణం..!
Breaking.. ఆరేళ్ళ బాలిక పై ఆటో డ్రైవర్ అత్యాచారం..చిత్తూరు జిల్లా లో దారుణం..!
తిరుపతి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా తిరుపతి లో ఓ మైనర్ బాలిక పై ఆటో డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.
తిరుపతి పద్మావతినగర్కు చెందిన దంపతులు వెంకటగిరికి వెళుతూ వారి కుమారుడు, కుమార్తె(8)ను తిరుమల నగర్లోని అమ్మమ్మ ఇంటిల్లో వదిలి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఆ చిన్నారి అమ్మమ్మ ఇంటి నుంచి బకెట్ తీసుకుని సమీపంలోని పద్మావతీనగర్ కి వెళ్లింది. ఇది గమనించిన ఆటో డ్రైవర్ మున్నా(37) చిన్నారితోపాటు ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు మూసివేసి ఉండటంతో చిన్నారికి మాయమాటలు చెప్పి బాత్రూంలోకి తీసుకెళ్లాడు. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో అమ్మమ్మ చిన్నారి అన్నను చూసిరమ్మని పంపింది. పద్మావతినగర్ ఇంటి బాత్రూంలో సోదరి మూలుగులు విని గట్టిగా కేకలు వేశాడు
పక్కింటిల్లో ఉన్న బంధువులు, స్థానికులు బయటకు రాగానే మున్నా గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. మహిళలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. చిన్నారిని పరీక్షల నిమిత్తం తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు