- Neti Charithra
Breaking.. ఆర్టీసీ బస్సు లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు..!
Breaking.. ఆర్టీసీ బస్సు లో మంటలు..పరుగులు తీసిన ప్రయాణికులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
ఆర్టీసీ బస్సులో మంటలు రావడంతో
ప్రయాణికులు పరుగులు తీసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.కృష్ణా జిల్లా కంకిపాడు విజయలక్ష్మి థియేటర్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ప్రమాదం జరిగింది. పామర్రు నుంచి విజయవాడ వెళ్తున్న మెట్రో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఇంజన్‌లోని విద్యుత్ సంబంధిత లోపంతో ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు ఏర్పడటంతో భయాందోళనకు గురైన ఆర్టీసీ సిబ్బంది బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. కూడలిలో ఉన్న యువత బస్సులోని ప్రయాణికులను కిందకు దింపి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు
314 views0 comments