• Neti Charithra

Breaking.. ఆర్టీసీ బస్సులో భారీగా పట్టుపడ్డ వెండి బిస్కెట్ లు.. !


Breaking.. ఆర్టీసీ బస్సులో భారీగా పట్టుపడ్డ వెండి బిస్కెట్ లు.. !



కర్నూలు: నేటి చరిత్ర

ఆర్టీసీ బస్సు లో ఎస్ ఈ బి అధికారులు

తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సు లో అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తున్న వెండి ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నగరంలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అధికారులు ఆదివారం ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న వెండి బయటపడింది. సెబ్‌ సీఐ రవిచంద్ర తమ సిబ్బందితో కలసి తెలంగాణ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేశారు. నంద్యాలలోని సంజీవనగర్‌కు చెందిన జీఎం జూవెలర్స్‌ యజమాని దర్గా షేక్‌నాసిర్‌ హుస్సేన్‌ వద్ద 78 (13.341 కిలోలు) వెండి బిస్కట్లు దొరికాయి. వీటికి సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు చూపకపోవడంతో సీజ్‌ చేశారు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే వెండిని కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.