• Neti Charithra

Breaking..ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు.. 14 కిలోల కు పైగా పట్టుపడ్డ బంగారు బిస్కెట్లు...!


Breaking..ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీలు.. 14 కిలోల కు పైగా పట్టుపడ్డ బంగారు బిస్కెట్లు...!



కర్నూలు: నేటి చరిత్ర



కర్నూలు లో ని పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారుల తనిఖీలో పెద్దయెత్తున్న14.8 కిలోల బంగారం పట్టుపడింది.తెలంగాణ వైపు నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేయగా రాజు అనే ప్రయాణికుడి సంచీలో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. విచారించగా తాను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్‌ కమ్‌ ట్రేడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే నగల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తానని, తన యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాదులోని ఓ బంగారు దుకాణం నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆధారాలు సరిగా లేకపోవడంతో బంగారాన్ని సీజ్‌ చేసి కర్నూలు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్