• Neti Charithra

Breaking.. ఆర్టీసీ బస్సు ను ఢీకొన్న..నలుగురితో ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం..ఇద్దరు మృతి..!


Breaking.. ఆర్టీసీ బస్సు ను ఢీకొన్న..నలుగురితో ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం..ఇద్దరు మృతి..!



కడప: నేటి చరిత్ర


ఆర్టీసీ బస్సు ఢీకొనటం తో ఇద్దరు మృతి చెందిన ఘటన కడప జిల్లా లో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారి మఠం మండలంలో నలుగురు కుటుంబ సభ్యులు ఒకే ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బద్వేలు- మైదుకూరు ప్రధాన మార్గంలోని ఓం చెరువు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని అధిగమించబోయి ముందు వస్తున్న బస్సును బైకు ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకుమారుడు అక్కడికక్కడేమృతి చెందగా బైకుపై ఉన్న మృతుడి భార్య సుగుణ, మరో కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు వల్లూరు మండలం చిన్ననాగిరెడ్డిపల్లికి చెందిన రామిరెడ్డి, అతని కుమారుడు ఉమేశ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను కడప జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.