• Neti Charithra

Breaking..ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విద్యుత్ శాఖ తాత్కాలిక సిబ్బంది..చిత్తూరుజిల్లా లో టెన్షన్


Breaking.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విద్యుత్ శాఖ తాత్కాలిక సిబ్బంది..చిత్తూరుజిల్లా లో టెన్షన్..!


చౌడేపల్లి: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా చౌడేపల్లి పరిసరాల్లో ని విద్యుత్ సబ్ స్టేషన్ లలో పని చేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు విద్యుత్ స్తంభాలు ఎక్కి ఆందోళనకు దిగటం తో ఉద్రిక్తత

నెలకొంది.వివరాలు ఇలా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో షిఫ్ట్ ఆపరేటర్లు గాచేరి పలువురు విధులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు బోయకొండ, రాంపల్లి, మంగళం, కోటగడ్డ, లగడిగం విద్యుత్ సబ్ స్టేషన్ లలో పనిచేస్తున్న వీరిని విధులకు రావద్దని ట్రాన్స్



కో అధికారులు ఆదేశించడం తో వారు అధికారుల తీరును నిరసిస్తూ విద్యుత్ స్తంభాలు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దింతో ఉద్రిక్తత నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు , విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకొని వారిని నచ్చచెప్పే ప్రయత్నం చేయటం తో పరిస్థితి అదుపు లోకి వచ్చింది.