• Neti Charithra

Breaking.. ఆటో ను ఢీకొన్న లారీ.. భారీ ప్రమాదం లో పెళ్లి కుమార్తెతో పాటు ఆరుగురు మృతి..!


Breaking.. ఆటో ను ఢీకొన్న లారీ..

భారీ ప్రమాదం లో పెళ్లి కుమార్తెతో పాటు ఆరుగురు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


మహబూబాబాద్ జిల్లా లో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బట్టల కోసం వెళుతున్న ఆటో ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది.ఈ ప్రమాదం లో ఆరుగురు మృతి చెందిన ఘటన చోటుచేసుకోగ ఈ ప్రమాదం పై

సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.గుడూరు మండలం మర్రిమిట్ట దగ్గర వద్ద లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో.. ఆరుగురు మృతి చెందారు.. లారీ కిందపడి మృతదేహాలు నుజ్జునుజ్జైపోయాయి.. మృతులు గూడూరు మండలం ఎర్రకుంట్ల తండా వాసులుగా గుర్తించారు గూడూరు నుండి నర్సంపేట ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. పెళ్లి బట్టల కోసం కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా ఆటో ఎక్కింది అమ్మాయి.. కానీ, అక్కడికి చేరుకోక ముందే తిరిగిరాని లోకాలకు పయనమైంది.. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు ప్రమీల, పెళ్లి కూతురు తల్లి కల్యాణి, దివ్య, రాము, ప్రదీప్‌, ప్రసాద్‌ మృతిచెందినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో అక్కడికి అక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు చనిపోయారు.. వరంగల్ నుండి మహబూబాబాద్‌ వైపు వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొట్టిందని.. తర్వాత కొద్దిదూరం ఆటోను ఈడ్చుకుంటూ వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు.