• Neti Charithra

Breaking.. ఆగి ఉన్న లారీ ని ఢీకొన్న కారు.. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తున్న నలుగురు మృతి..!


Breaking.. ఆగి ఉన్న లారీ ని ఢీకొన్న కారు.. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తున్న నలుగురు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


ప్రకాశం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ ని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

పక్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు చెందిన

భక్తులు తిరుమల దర్శనానికి వచ్చి వెళుతూ

మార్టూరు వద్ద జాతీయ రహదారిపై. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో

మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఏలూరుకు చెందిన విజయలక్ష్మి, కనకమహాలక్ష్మి, సత్యనారాయణ.. హైదరాబాద్‌కు చెందిన చిన్నబాబు(60)గా గుర్తించారు. సమాచారం అందడంతో పోలీసుల, హైవే సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ న్నారు.