• Neti Charithra

Breaking.. అసెంబ్లీలో చంద్రబాబు తోపాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్లెలు పై వేటు..!


Breaking.. అసెంబ్లీలో చంద్రబాబు తోపాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్లెలు పై వేటు..!



సచివాలయం: నేటి చరిత్ర



ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే సభ నుంచి చంద్రబాబు సహా 14 మంది సభ్యులు సస్పండ్ అయ్యారు.. సభా కార్యక్రమాలు అడ్డుకున్నందుకు ఒకరోజు పాటు 14మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు..సభ నంచి చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల

వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్‌ సస్పెండ్ అయ్యారు. కాగా, తుపాను పంట నష్టంపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. నిమ్మల రామానాయుడు విమర్శలకు సీఎం

జగన్ సమాధానం ఇచ్చారు. అయితే సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది. దీంతో అధికార పక్షం తీరుకు నిరసనగా చంద్రబాబు పోడియం ఎదుట బైఠాయించారు. దీంతో అసెంబ్లీ ప్రధాన

ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు

సభలో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు.


425 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon