• Neti Charithra

Breaking.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. గ్రామ సచివాలయ ఉద్యోగి మృతి.. పిటిఎం మండలం లో విషాదం..!


Breaking.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..

గ్రామ సచివాలయ ఉద్యోగి మృతి.. పిటిఎం మండలం లో విషాదం..!



పెద్దతిప్పసముద్రం: నేటి చరిత్ర


(రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన ఉద్యోగి)


చిత్తూరు జిల్లా పిటిఎం మండలం లో జరిగిన రోడ్డు ప్రమాదం లో పెట్టేంవాండ్ల పల్లి గ్రామ సచివాలయానికి కి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ బావజాన్ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తంబల్లపల్లె మండలం గంగిరెడ్డి పల్లె కు చెందిన బావజాన్ పట్టేంవాండ్ల పల్లె గ్రామ సచివాలయ వేటర్నేటి అసిస్టెంట్ గా పనిచేస్తుండగా పని భారంతో బుధవారం రాత్రి 12 గంటల వరకు విధులు చూసి ద్విచక్ర వాహనం లో స్వగ్రామం కు వెళుతుండగా పులికల్లు సమీపం ఆయన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. ఇతన్ని మరో వాహనం ఢీకొందా.. లేక అదుపు తప్పి వాహనం బోల్తా పడిందా అన్న విషయం పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సి ఉంది.