• Neti Charithra

Breaking.. అర్ధరాత్రి.. మరో దారుణం.. బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..!


Breaking.. అర్ధరాత్రి.. మరో దారుణం..

బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు..!



టెక్కిలి: నేటి చరిత్ర


ఏపీ లో మరో ఘోరం జరిగింది..

శ్రీకాకుళం టెక్కలిలో బుద్దుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ధ్వంసం చేశారు. ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం పక్కనున్న ఉద్యానవనంలో ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు బుద్దుని విగ్రహం ఉంది. ఈ విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల రోజుల క్రితం కొందరు దుండగులు

ధ్వంసం చేయగా గుర్తించిన అధికారులు శిల్పి సాయంతో కొత్త చేతిని అమర్చారు. అయితే.. ఆదివారం రాత్రి బుద్దుని చేయిని ఎవరో మళ్లీ విరగ్గొట్టారు. ఈ పని కొందరు ఆకతాయిలు కావాలనే చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడి అధికారులు కు పలు సూచనలు చేశారు.

194 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon