• Neti Charithra

Breaking.. అర్ధరాత్రి..గ్రామ వాలంటీర్ ను పొడిచి చంపిన దుండగులు.. కేసు నమోదు..!


Breaking.. అర్ధరాత్రి..గ్రామ వాలంటీర్ ను పొడిచి చంపిన దుండగులు.. కేసు నమోదు..!



అనంతపురం-నేటి చరిత్ర



పొలం వద్ద నిద్రిస్తున్న ఓ గ్రామ వాలంటీర్ ను గుర్తుతెలియని దుండగులు దారుణ హత్య కు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు..కూడేరు మండలం మరుట్లలో శివరాంపేట చెందిన గ్రామ వాలంటీర్‌ శ్రీకాంత్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గత అర్థరాత్రి వేరుశనగ పంటకు కాపలా వెళ్లిన శ్రీకాంత్‌.. తెల్లవారేసరికి పొలం దగ్గరే శవమై కనిపించాడు. పొలంలో నిద్రిస్తుండగా దుండగులు గునపంతో పొడిచి చంపారు. ఉదయం పొలం వైపుగా వెళ్తున్న కొందరు గుర్తించి.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్