• Neti Charithra

Breaking.. అర్ధరాత్రి కూలిన ఇల్లు.. ఓకే కుటుంబం లోఐదుగురు మృతి..!


Breaking.. అర్ధరాత్రి కూలిన ఇల్లు.. ఓకే కుటుంబం లోఐదుగురు మృతి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


దసరా పండుగ వేళ.. పెను విషాదం చోటు చేసుకుంది..వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో అయిదుగురు

మృతి చెందారు. బుద్ధారం

గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన భార్య

మణెమ్మ (68) గ్రామంలో నివసిస్తుండగా, ఆమె కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగియగా రాత్రి భోజనాల అనంతరం 9 మంది ఓ గదిలో పడుకున్నారు.ఆ గది పైకప్పు అర్ధరాత్రి కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతోపాటు ఆమె ఇద్దరు కోడళ్లు

సుప్రజ (40), ఉమాదేవి (35), మనవరాళ్లు వైష్ణవి (14), అక్షయ (12) అక్కడిక్కడే మృతి చెందారు. మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య సుప్రజ, కుమార్తెలు వైష్ణవి, అక్షయ  ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.