• Neti Charithra

Breaking.. అర్ధరాత్రి.. కారు బోల్తా.. ఘోర ప్రమాదంలో నలుగురు మృతి..!

Updated: Oct 17, 2020


Breaking.. అర్ధరాత్రి.. కారు బోల్తా.. ఘోర ప్రమాదంలో నలుగురు మృతి..!



గుంటూరు: నేటి చరిత్ర



అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో

నలుగురు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిలో రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య ఈ

ప్రమాదం జరిగింది. కారు తంగేడుమల్లి మేజర్‌ కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతిచెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నివాసముంటున్న మాధవ్‌ అనే వ్యక్తి గృహాలకు రంగులు వేస్తుంటాడు. ప్రకాశం జిల్లా పామూరిలోని సొంతింటికి రంగులు వేయించేందుకు తన దగ్గర పనిచేస్తున్న బీరూగౌడ్‌, బాలాజీతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల్ని తీసుకుని గురువారం రాత్రి జగిత్యాల నుంచి కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో గురువారం

అర్ధరాత్రి సమయంలో రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్‌ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బీరూ గౌడ్‌, బాలాజీతో పాటు మరో ఇద్దరు మృతిచెందారు.


263 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon