• Neti Charithra

Breaking... అర్థ రాత్రి బ్యాంకు దోపిడీ.. దుండగులు..రూ.3.10 కోట్లు దోచుకెళ్లారు..!


Breaking... అర్థ రాత్రి బ్యాంకు దోపిడీ..

దుండగులు..రూ.3.10 కోట్లు దోచుకెళ్లారు..!హైదరాబాదు: నేటి చరిత్ర


ఎస్ బి ఐ బ్యాంక్ లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగిన ఘటన తెలంగాణా లోని పెద్దపల్లి జిల్లాలో సంచలనం కలిగించింది.

పోలీసుల కథనం మేరకు..

మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మొత్తం రూ.3.10కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు. దొంగలు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్‌ తీసేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సైతం బయటపడకుండా సీసీ ఫుటేజీ డీవీఆర్‌ బాక్స్‌ను సైతం వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్‌ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.