• Neti Charithra

Breaking.. అరటి పంటలపై ఏనుగు ల దాడులు..చిత్తూరు జిల్లాలో మళ్ళీ భారీ నష్టం..!


Breaking.. అరటి పంటలపై ఏనుగు ల దాడులు..చిత్తూరు జిల్లాలో మళ్ళీ భారీ నష్టం..!



వి కోట: నేటి చరిత్ర


( ఏనుగు ల దాడి లో దెబ్బతిన్న అరటి పంట)


చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఏనుగుల గుంపు దాడి లో పలుఅరటి పంటలకు తీవ్ర నష్టం కలిగింది.రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. నాలుగు రోజుల ముందు కర్నాటక నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు

కొద్ది రోజులుగా ఈ పరిసర అటవీ ప్రాంతాల్లోనే మకాం వేశాయి. గోనుమాకులపల్లె బీటు పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన

రైతు సోమశేఖర్‌ 1400 వందల అరటి మొక్కలు నాటాడు. ఇందుకుగాను సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. పంటకు ఐదు నెలలు గడుస్తోంది. రాత్రి పదిహేడు ఏనుగుల గుంపు అరటి పంటపై దాడిచేసి తొక్కి,తిని ఆరగించాయి. డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేశాయి. చేతిలోకొచ్చే పంట తెల్లారేసరికి నేలమట్టమవడంతో రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్