• Neti Charithra

Breaking.. అమ్మఒడి డబ్బుల కోసం..భార్యను హత్యచేసిన తాగుడు బోతు భర్త..!


Breaking.. అమ్మఒడి డబ్బుల కోసం..భార్యను హత్యచేసిన తాగుడు బోతు భర్త..!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ప్రభుత్వం నుంచి వచ్చిన అమ్మఒడి నగదు

మద్యం తాగేందుకు ఇవ్వలేదని కట్టుకున్న భార్యనే భర్త హత్య చేసిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి ఎస్సై సుధాకర్‌ కథనం మేరకు..

గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమెను డబ్బులు విత్‌డ్రా చేయాలని భీమన్న ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించటంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. అదే

రోజు గుమ్మకోట సంతకు వెళ్లారు. ఎంత చెప్పినా డబ్బులు తీసేందుకు ఆమె నిరాకరించింది. కోపగించిన భర్త సంత నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పొలాల వద్ద ఆమెను బండతో కొట్టి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.