• Neti Charithra

Breaking.. అమరావతి రాజధాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు .. పలు చోట్ల ఉద్రిక్తత..!


Breaking.. అమరావతి రాజధాని కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు .. పలు చోట్ల ఉద్రిక్తత..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో

పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పలు చోట్ల ఉద్రికతలు చోటు చేసుకున్నాయి.

అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులవుతున్న సందర్భంగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌టీసీ రోడ్‌లోని శారదా కళాశాల నుంచి ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఈ

ప్రదర్శనలో రాజకీయ, ప్రజాసంఘాల నాయకులతో పాటు పెద్ద ఎత్తున రైతులు  పాల్గొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు.