• Neti Charithra

Breaking.. అమరావతి భూముల కేసులో చంద్రబాబు ఇంటికి వెళ్లిన సి ఐ డి అధికారులు..!


Breaking.. అమరావతి భూముల కేసులో చంద్రబాబు ఇంటికి వెళ్లిన సి ఐ డి అధికారులు..!



అమరావతి: నేటి చరిత్ర


టీడీపీ జాతీయ అధ్యక్షులు,

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు .అమరావతి భూముల కుంభకోణంలో చంద్రబాబు పై ఇప్పటికే కేసు నమోదైంది. అమరావతి భూముల కుంభకోణం సంబంధించి కేసుకు సంబంధించి తమ ముందు హాజరు కావాలంటూ 41 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసును హైదరాబాదులో ఉన్న చంద్రబాబు నాయుడు కి అందజేశారు. ఏపీ సిఐడి ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ నెల 23వ తేదీన తమ ముందు హాజరై పూర్తి వివరాలు అందించాలని ఏపీ సిఐడి అధికారులు చంద్రబాబునాయుడికి నోటీసులు ఇచ్చారు. అమరావతి భూములు కొనుగోలు లో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. అంతేకాకుండా ఈ భూముల వ్యవహారంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తోంది. కాగ ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ పైకూడా కేసు నమోదు చేసిన సి ఐ డి పోలీసులు ఆయన కు కూడా నోటీసులు ఇచ్చారు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్