• Neti Charithra

Breaking.. అమరావతి జన భేరికి పోటెత్తిన .. రైతులు.. టీడీపీని అడ్డుకున్న పోలీసులు..!


Breaking.. అమరావతి జన భేరికి పోటెత్తిన .. రైతులు.. టీడీపీని అడ్డుకున్న పోలీసులు..!



అమరావతి: నేటి చరిత్ర


అమరావతిలో జనభేరివిజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమనికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు సీపీఐ, సీపీఎం , కాంగ్రెస్ నేతలు రామకృష్ణ, మధు , శైలజానాథ్ లతో పాటు పలుపార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు రైతులు పెద్దఎత్తున హాజరు అయ్యారు. మొదట టీడీపీ నేతల రాకను పోలీసులు అడ్డుకున్నారు. దింతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు చంద్రబాబు తో సహా టీడీపీ నేతలను జన భేరి కి అనుమతి ఇచ్చారు.

సభకు హాజరయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. అంతకముందు ఆయన ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. దేవతల రాజధాని అయిన అమరావతిని కాపాడాలంటూ దుర్గమ్మను ప్రార్థించానని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఏడాది పాటు పూర్తయిన ఉద్యమాన్ని దుర్గమ్మ చూస్తూనే ఉందని, న్యాయం చేస్తుందన్నారు. ప్రజారాజధాని అమరావతి అందరికల అన్న చంద్రబాబు.. దానిని విధ్వంసం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఎన్నో విధాలుగా దాడులు చేసినా అమరావతిని కాపాడుకునేందుకు ఏడాదిగా పోరాడుతున్నారని అన్నారు.

ఉద్దండరాయునిపాలెం వెళ్లుతున్న తెదేపా అధినేత చంద్రబాబును.. వెలగపూడి వద్ద పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. పోలీసులతో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ చర్చలు జరిపిన అనంతరం.. ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు

పోలీసులు అనుమతి ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రదేశాన్ని చంద్రబాబు సందర్శించి.. అనంతరం రాయపూడి సభకు చేరుకొని ప్రసంగించారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని వేదిక పై నుంచి హెచ్చరించారు.

140 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon