• Neti Charithra

Breaking.. అప్పు వసూలు శిరోముండ నం చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. అప్పు వసూలు కోసం

శిరోముండ నం చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


అప్పు వసూలు కోసం శిరోముండ నం చేసిన ఘటన పక్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ కుటుంబరావు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన అలక అభిలాష్‌ (23)

జంగారెడ్డిగూడెంకు చెందిన యర్రసాని విజరుబాబు వద్ద మూడు నెలల క్రితం రూ. 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చాలంటూ విజరుబాబు గత మూడు రోజులుగా అభిలాష్‌ని అడుగుతున్నాడు. ఇదే విషయమై ఈ నెల 3వ తేదీ రాత్రి విజరుబాబు, తన మిత్రులు షేక్‌ నాగూల్‌ మీరావలి, కంకిరెడ్డి మార్కేండేయులతో కలిసి తాడేపల్లిగూడెంలోని అభిలాష్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి అభిలాష్‌ను కారులో ఎక్కించుకుని నేరుగా జంగారెడ్డిగూడెం బాట గంగానమ్మ లేఅవుట్‌ కాలనీకి తీసుకువచ్చి ఓ ఇంట్లో ఉంచారు.

తీసుకున్న అప్పు తీర్చలేకపోవడంతో మరో వ్యక్తితో అభిలాష్‌కు శిరోముండనం చేయించారు. అనంతరం యువకుడిని స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాధితుడు అభిలాష్‌ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.