• Neti Charithra

Breaking...అనంతపురం లో టీడీపీ కి భారీ షాక్..చివరి నిముషం లో వైసీపీకి జై కొట్టినకౌన్సిలర్ అభ్యర్థులు


Breaking...అనంతపురం లో టీడీపీ

కి భారీ షాక్..చివరి నిముషం లో వైసీపీ కి జై కొట్టిన కౌన్సిలర్ అభ్యర్థులు..!



అనంతపురం: నేటి చరిత్ర


మున్సిపల్ ఎన్నికల వేళ అనంతపురం

టీడీపీ కి భారీ షాక్ తగిలింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల వేళ టీడీపీకి పార్టీ అభ్యర్థులు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్

ఇంకా మూడు రోజులు ఉండగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 వార్డు డివిజన్ టీడీపీ అభ్యర్థి గవ్వల లీలావతి, లోక్ నాథన్ లు టీడీపీకి రాజీనామా చేశారు. వీరు వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి వైసీపీ లో చేరడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి.