- Neti Charithra
Breaking.. అనంతపురం లో ఒకే రోజు మూడు దారుణ హత్యలు..స్థానికుల్లో భయం..భయం..!
Breaking.. అనంతపురం లో ఒకే రోజు మూడు దారుణ హత్యలు..స్థానికుల్లో భయం..భయం..!
అనంతపురం : నేటి చరిత్ర
(మహిళను చంపి కాల్చివేసిన దృశ్యం)
అనంతపురంలో ఒకేరోజు మూడు దారుణ
హత్యలు సంచలనం కలిగించాయి. ఆదివారం ఉదయం అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని
చెరువుకట్టపై గుజరీ అమ్ముకునే ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. శింగనమల మండల పరిధిలోని నాయనిపల్లి క్రాస్‌లో ఉన్న పొలాల వద్ద ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతురాలు పెద్దపప్పూరు మండలం నరసాపురానికి
చెందిన నరసమ్మగా పోలీసులు గుర్తించారు.
నల్లమాడ మండలం రెడ్డికుంట తండాల్లోని బుక్కా కాసేనాయక్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తండా సమీపంలోని వంకలో బండరాయితో మోది హత్య చేశారు. జిల్లాలో ఒకేరోజున ముగ్గురు హత్యకు గురికావడం ప్రజల్లో తీవ్ర భయాందోళను రేకెత్తించింది. నిందితుల కోసం పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.