• Neti Charithra

Breaking.. అధికార పార్టీ.. ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి.. వైసీపీ లో విషాదం..!


Breaking.. అధికార పార్టీ.. ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి.. వైసీపీ లో విషాదం..!



కడప: నేటి చరిత్ర


కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్

చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య కొంత కాలం సేవలందించారు.వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 3 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.