- Neti Charithra
Breaking.. అదృశ్యం అయిన భార్య అనుమానాస్పద మృతి.. విషయం తెలిసి చిత్తూరు జిల్లా లోభర్త ఆత్మహత్య..!
Breaking.. అదృశ్యం అయిన భార్య అనుమానాస్పద మృతి.. విషయం తెలిసి
చిత్తూరు జిల్లా లోభర్త ఆత్మహత్య..!
రామకుప్పం: నేటి చరిత్ర
పెళ్లి అయిన మూడు మాసాలకే.. అదృశ్యం ఆయిన భార్య మృతి చెందడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం లో సంచలనం కలిగించింది. పోలీసుల కథనం మేరకు..
రామకుప్పం మండలంలోని మణేంద్రం గ్రామానికి చెందిన మునిరత్నం(25), పావని(20) మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. అయితే అనుకోకుండా పావని అదృశ్యమవడంతో.. ఆమె
కుటుంబసభ్యులు ఈ నెల 16న రామకుప్పం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మణేంద్రం గ్రామంలోని కల్లగుట్టబావిలో పావని మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న భర్త మునిరత్నం భయాందోళనకు గురై అత్తికుప్పంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పలమనేరు డీఎస్పీ గంగయ్య, కుప్పం గ్రామీణ సీఐ యతీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.