• Neti Charithra

Breaking... అదృశ్యం అయిన బాలుడి.. మృతదేహం లభ్యం.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking... అదృశ్యం అయిన బాలుడి.. మృతదేహం లభ్యం.. చిత్తూరు జిల్లా లో విషాదం..!



పీలేరు: నేటి చరిత్ర


(చెరువు లో తేలిన బాలుడు వరుణ్ ) ఫైల్ ఫోటో


చిత్తూరు జిల్లా పిలేరులో అదృశ్యం ఆయిన ఓ బాలుడు చెరువులో శవమై తేలడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.పీలేరులో ని రోజా ప్లాట్స్


లో కాపురముంటున్న పూజిత కుమారుడు వరుణ్ మంగళవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లి తప్పిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల,కుటుంబ సభ్యుల ఇండ్లలో వెతికిన కనబడలేదు.అయితే ఈ ఉదయం కోటపల్లి సమీపంలోని మోటుచెరువులో


విగతజీవుడై వున్న బాలుడు వరుణ్(6) మృతదేహం లభ్యమైంది ఈవిషయం తెలుసుకున్న వారందరూ కన్నీరు మున్నీరైయారు కోట్టపల్లిలో మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.