• Neti Charithra

Breaking.. అదుపు తప్పి.. నీటి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి..!


Breaking.. అదుపు తప్పి.. నీటి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)




ఆరుగురి తో ప్రయాణిస్తున్న కారు నీటి కాల్వలోకి దూసుకెళ్లటం తో ముగ్గురు మృతి చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లో పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో


ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. అందులో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా తెలుస్తోంది. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. కారును కెనాల్‌ నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్