• Neti Charithra

Breaking.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి..!


Breaking.. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి..!



రాజమండ్రి: నేటి చరిత్ర


రాజమండ్రి సమీపంలో అదుపు తప్పిన కారు చెరువులోకి దూసుకెళ్లటం తో ముగ్గురు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

యానాంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రసాదరావు, అతని భార్య విశ్రాంత అధ్యాపకురాలు విజయలక్ష్మి .. కుమారుడు సంతోష్‌ చంద్ర ప్రణీత్‌

నిశ్చితార్థం ముగించుకొని గురువారం రాత్రి ఏటిగట్టు రహదారిపై యానాం బయలు దేరారు. ఈ క్రమంలో కె.గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామం వద్దకు రాగానే కారు అదుపు తప్పి గోదావరి ఏటి గట్టు రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో ఎవరూ గుర్తించలేకపోయారు. చెరువులోతు పెద్దగా లేకపోయినా.. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయి నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెస్తున్నారు.




365 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon