• Neti Charithra

Breaking.. అదుపు తప్పి..కారు బోల్తా.. ఇద్దరు మృతి..!


Breaking.. అదుపు తప్పి..కారు బోల్తా.. ఇద్దరు మృతి..!



అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం – బెలుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.అనంతపురంలోని రాంనగర్ కి చెందిన నలుగురు కుటుంబసభ్యులు కారులో ధర్మస్థలం వెళ్లి వస్తుండగా హనిమిరెడ్డిప ల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో యోగేశ్వర్ (45), సుప్రియ(40), వీరి కూతురు బేబీ (3), సుప్రియ తండ్రి ఉన్నారు. ఈ ప్రమాదంలో బేబీ (3), సుప్రియ తండ్రి మృతి చెందారు.మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం హాస్పిటల్ కు తరలించారు.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.