• Neti Charithra

Breaking.. అత్తను గొంతు నులిమి హత్య చేసిన కసాయి అల్లుడు అరెస్ట్..!


Breaking.. అత్తను గొంతు నులిమి హత్య చేసిన కసాయి అల్లుడు అరెస్ట్..!


ప్రొద్దుటూరు: నేటి చరిత్ర



తన భార్యను సరిగా పలకరించడం లేదని ఆక్రోశం తో అల్లుడు సొంత అత్తనే గొంతు నులిమి హత్య చేసిన ఘటన లో అల్లున్ని అరెస్ట్ చేసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరు

సీఐ విశ్వనాథ్‌రెడ్డికథనం మేరకు.. వివేకనంద కాలనీకి చెందిన జక్కం గ్రేసమ్మ (50) తన భర్తతో మనస్పర్థలు రావడంతో ఎనిమిదేళ్ల నుంచి శంకరాపురంలోని పెద్ద కుమార్తె బాగా చూసుకుంటోందని అక్కడే ఉండేడి. నక్కలదిన్నెలో ఉన్న రెండో


కుమార్తెను పట్టించుకోలేదన్న కారణంతో అల్లుడు సూరిబాబు అత్తను హత్య చేసినట్లు సీఐ తెలిపారు. కుమార్తెను చూసేందుకు వచ్చిన అత్తను నక్కలదిన్నె నుంచి ప్రొద్దుటూరులో వదిలేందుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. కొర్రపాడు రోడ్డులో అత్తతో గొడవపడిన అల్లుడు సూరిబాబు ఆమెను ద్విచక్ర వాహనం నుంచి కింద పడేసి గొంతు నులిమి హత్య చేసినట్లు సీఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపారు.