• Neti Charithra

Breaking...అటవీశాఖ నీటి కుంటలోపడ్డ భార్యను రక్షించ బోయి..భార్య భర్త మృతి..చిత్తూరు జిల్లాలో విషాదం!


Breaking... అటవీశాఖ నీటి కుంటలో పడ్డ భార్యను రక్షించ బోయి.. భార్య భర్త మృతి..చిత్తూరు జిల్లాలో విషాదం!




తంబల్లపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా తంబల్లపల్లె లో విషాదం చోటుచేసుకుంది. అటవీశాఖ

సరిహద్దు లో తీసిన లోతైన కాలువలో పడి దంపతులు మృతి చెందిన సంఘటన

సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు..

తంబళ్లపల్లి సమీపంలోని కురువ పల్లెకు చెందిన కొల్లేనారాయణ (70) రమణమ్మ (62) లు అటవీ ప్రాంత సమీపంలోని తమ పొలం వద్ద వ్యవసాయ పనులకు వెళ్లడం ఆనవాయితీ. సోమవారం సాయంత్రం యదా విధిగా పొలం వద్ద పనులు చూసుకుంటూ రమణమ్మ పక్కనే గల ఫారెస్ట్ సరిహద్దు వద్ద నీటి కుంటలో బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయింది. ఆమె హఠాత్తుగా కేకలు వేయడంతో పొలంలో పనులు

చేసుకుంటున్న నారాయణ హుటాహుటిన వెళ్లి భార్యను కాపాడడానికి నీళ్లలో దూకాడు. వయసు మీద పడటంతో నారాయణ భార్యను కాపాడ లేకపోగా అతను సైతం నీళ్ళల్లో మునిగి పోయాడు. భార్య రమణమ్మ మృతదేహం తేలియాడుతూ ఉండగా నారాయణ మృతదేహం నీటి అడుగు భాగంలో నిలిచిపోయింది.దంపతులు మృతి చెందిన విషయం గొర్రెల కాపరులు ద్వారా

తెలుసుకున్న కుమారుడు శ్రీనివాసులు వెంటనే పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించాడు. ఎస్సై సహదేవి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఆ నిరుపేద దంపతులు మృతితో కురువ పల్లి లో విషాద ఛాయలు అలముకున్నాయి.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్