• Neti Charithra

Breaking.. అక్రమ మద్యాన్ని తరలిస్తూ.. పట్టుపడ్డ పోలీసులు.. ముగ్గురి పై కేసు నమోదు..!


Breaking.. అక్రమ మద్యాన్ని తరలిస్తూ.. పట్టుపడ్డ పోలీసులు.. ముగ్గురి పై కేసు నమోదు..!నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు కారులో మద్యం తెస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బంది స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఎస్‌ఈబీ) అధికారులకు పట్టుబడ్డారు. జంగారెడ్డిగూడెం ఎస్సై-2 పొలా రామకృష్ణ


తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఈబీ అధికారులు జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో వాహన తనిఖీలు చేసి ఓ కారులో 70 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ కారును, మద్యం సీసాలను ఎస్‌ఈబీ సీఐ షేక్‌ అఖిల్‌ జమా స్వాధీనం చేసుకుని జంగారెడ్డిగూడెం స్టేషన్‌కు తరలించారు. కారులో ఉన్న ముగ్గురు

నిందితుల్లో బుట్టాయగూడెం స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మరపట్ల రాజు, కానిస్టేబుల్‌ కుసుమరాజు కోటేశ్వరరావు ఉన్నారు. వీరితో పాటు వాహన డ్రైవర్

చోడెం ధర్మరాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.