- Neti Charithra
Break ung.. పచ్చటి సంసారం..ఛిద్రం..ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య ..చిత్తూరు లో ఘోరం..!
Break ung.. పచ్చటి సంసారం..ఛిద్రం..ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య
..చిత్తూరు లో ఘోరం..!
చిత్తూరు: నేటి చరిత్ర
ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న కుటుంబం .. సాఫీగా సాగాల్సినజీవితం..ఏం జరిగిందో..ఏమో ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది.
వివరాలు ఇలా ఉన్నాయి.ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో గ్రామంలో
విషాదఛాయలు అలుముకున్నాయి. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన ముత్తుకు స్థానిక ఓబనపల్లెకు చెందిన ధనలక్ష్మికి పదేళ్ల క్రితం వివాహమైంది. భర్త మేస్త్రి. ఆమె భోజనశాలలో పనిచేస్తోంది. వారికి ఝాన్సీ(8) ఉదయ్(4) పిల్లలు. ప్రశాంతంగా సాగుతున్న వారి కుటుంబంలో మనస్పర్థ.లు మొదలై కుటుంబాన్నే చిన్నాభిన్నం చేశాయి. చిన్నపాటి వివాదాలతో మూడేళ్లుగా
అమ్మగారింట్లో ఉంటూ పిల్లలను పోషిస్తోంది. ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో తండ్రి హితవు పలికాడు. ఒంటరి జీవితం, ఆర్థిక సమస్యలతో జీవితంపై విరక్తి చెంది.. ఈ నెల నాల్గో తేదీన వేకువజామున తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండ్రోజులుగా వెతికినా ఫలితం లేేకపోవడంతో ఆరో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యంపై చిత్తూరు రెండో పట్టణ సీఐ యుగంధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా బావిలో ముగ్గురి మృతదేహాలు ను పోలీసులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు.