- Neti Charithra
Big Breaking.. లోయలో పడ్డ పెళ్లి వ్యాను.. ఏడుగురు మృతి..!
Big Breaking.. లోయలో పడ్డ పెళ్లి వ్యాను.. ఏడుగురు మృతి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం
ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు హాజరై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా...వ్యాను అదుపుతప్పి బోల్తాపడటంతో ఏడుగురు మృతి చెందారు.
ఈ ఘోర ప్రమాదం గోకవరంలో
చోటుచేసుకుంది. రాజానగరం మండలం వెలుగుబందా, గోకవరం మండలం ఠాకూర్పాలెంకు చెందిన వధూవరులకు గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది. వివాహ వేడుక పూర్తయిన తర్వాత వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు దాదాపు 22 మంది వ్యానులో కొండపై నుంచి తిరుగు ప్రయాణమయ్యారు
. ఈ క్రమంలో వ్యాను బ్రేకులు ఫెయిల్అవడంతో అదుపుతప్పి మెట్ల మార్గం ద్వారా కొండ కిందకు బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు.
397 views0 comments