• Neti Charithra

Betaling..14 మాసాలు గా అద్దె ఇవ్వలేదని..గ్రామ సచివాలయానికి తాళాలు..ఉద్యోగుల కు తప్పని అవస్థలు..!


Betaling..14 మాసాలు గా అద్దె ఇవ్వలేదని..గ్రామ సచివాలయానికి తాళాలు..ఉద్యోగుల కు తప్పని

అవస్థలు..!


అనంతపురం: నేటి చరిత్ర


సచివాలయ కార్యాలయ అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని సచివాల యం కు తాళాలు వేసిన ఘటన అనంతపురం జిల్లాల్లో చోటు చేసుకుంది.

దింతో ఒకరోజు పాటు ఉద్యోగులు అవస్థలు పడ్డారు.వివరాల్లోకి వెళితే..రొద్దంమండలం లోని నారనాగేపల్లి గ్రామ సచివాలయానికి 14 నెలలుగా అద్దె చెల్లించ లేదని సంబంధిత భవన యజమాని మంజురెడ్డి బుధవారం తాళం వేశారు. ఉదయం కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులను బయటకు పంపించి తాళం వేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు సచివాలయ ఉద్యోగులు బయటే విధులు

నిర్వహించారు. సమాచారం అందుకున్న కార్యదర్శి మహేష్‌ గ్రామానికి చేరుకుని ఇంటి యజమానితో చర్చించి, 12 నెలలకు సంబంధించిన అద్దె చెల్లించారు. దీంతో ఆయన గ్రామ సచివాలయానికి వేసిన తాళం తీసి వేయడంతో సిబ్బంది యధావిధిగా కార్యాలయంలో విధులు నిర్వహించారు. కాగ పరిస్థితిని కార్యదర్శి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం తో ఉన్నతాధికారులు సూచన మేరకు..ఇంటి యజమానికి 12 నెలలకు సంబంధించిన అద్దె చెల్లించడం తో సచివాలయ గది తాళాలు తెరుచుకున్నాయి.