• Neti Charithra

Breaking.... ప్రేమోన్మాది.. ఘాతుకం..మైనర్ బాలిక దారుణ హత్య..!


Breaking.... ప్రేమోన్మాది.. ఘాతుకం..మైనర్ బాలిక దారుణ హత్య..!


నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


విశాఖ నగరం లో అర్ధరాత్రి ఉన్మాది

రెచ్చిపోయాడు.ప్రేమించిన అమ్మాయి దక్కడంలేదనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలా మారి కత్తితో దాడి చేశాడు.

గొంతు కోసి నిండు ప్రాణాలు తీశాడు.

గాజువాక సీఐ మల్లేశ్వరరావు కథనం మేరకు.. విశాఖనగరంలోని గాజువాక దరి శ్రీనగర్‌కు చెందిన బాలిక(17) స్థానిక కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. పాత గాజువాక ఎల్‌వీనగర్‌లో న్యాయశాస్త్రం(బీఎల్‌) మూడో సంవత్సరం చదువుతున్న

అఖిల్‌(23)తో ఆమెకు కొన్నేళ్లుగా పరిచయముంది. ఇటీవల ఆమె శ్రీనగర్‌కు చెందిన రామ్‌ అనే యువకుడితో చనువుగా ఉండడాన్ని భరించలేని అఖిల్‌ నాలుగు రోజుల కిందట అతనితో గొడవపడ్డాడు. శనివారం రాత్రి 10 గంటలకు శ్రీనగర్‌ సాయిబాబా గుడి వద్ద ఇద్దరూ మాట్లాడుకోవడాన్ని అఖిల్‌ గమనించాడు. తీవ్ర ఆగ్రహానికి గురై, ఒక్కసారిగా కత్తితో బాలికపై దాడి చేయగా రామ్‌ పరారయ్యాడు. బాలిక గొంతు భాగం పూర్తిగా తెగి, తీవ్ర రక్తస్రావంతో

కొట్టుమిట్టాడుతుండగా అఖిల్‌ కూడా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇంతలో చుట్టుపక్కల వారు బాధితురాలిని గాజువాకలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.