• Neti Charithra

Betaling.. ఇంట్లో పని ఇచ్చిన యజమాని ఇంటికి కన్నం..రూ.18 లక్షలు నగదు బంగారం ..చోరీ..!


Betaling.. ఇంట్లో పని ఇచ్చిన యజమాని ఇంటికి కన్నం..రూ.18 లక్షలు నగదు బంగారం ..చోరీ..!

నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఇంట్లో..పని ఇచ్చిన యజమాని ఇంటికి కన్నం వేసి ..రూ.18 లక్షలు చోరీ చేసిన ఘటన హైదరాబాదు నగరం

నాచారం పోలీస్ స్టేషన్ పరిధి హెచ్ఎంటీనగర్‌లో చోటు చేసుకుంది.  నేపాల్‌కు చెందిన పనిమనుషులు

ఈ భారీచోరీకి పాల్పడ్డారు.   ఇంట్లో వారు శుభకార్యానికి వెళ్ళగా అదును చూసుకొని ఇంట్లో ఉన్న వృద్ధురాలికి  దుండగులు మత్తు మందు ఇచ్చారు. ఆపై ఇంట్లో ఉన్న రూ.10 లక్షల నగదుతో పాటు 18 తులాల బంగారాన్ని చోరీ చేసి పరారయ్యారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేపాలీ జంటకు సంబంధించిన ఏజెన్సీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.