• Neti Charithra

AP Corona Update (24 April 2021): బాబోయ్ కరోనా. ఏపీలో 10 లక్షలు దాటిన కేసులు...


ఏపీని కరోనా ఘోరంగా భయపెడుతోంది. 24 గంటల్లోనే నమోదైన కేసుల సంఖ్య 11 వేల మార్కును దాటగా.. రెండు దశల్లో కలిపి భారత్ లో నమోదైన కేసుల సంఖ్య పది లక్షల మార్కును దాటింది.


ఆంధ్ర ప్రదేశ్ ను కరోనా భయపెడుతోంది. రోజు రోజుకూ ఊహించని స్థాయిలో కరోనా విస్తరిస్తోంది. తాజాగా ఏపీలో ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల సంఖ్య 11 వేల మార్కును దాటడం ఆందోళన పెంచుతోంది. అలాగే ఇప్పటి వరకు ఓవరాల్ గా నమోదైన కేసుల సంఖ్య కూడా 10 లక్షల మార్కును దాటేసింది.

ఏపీలో గత 24 గంటల్లో 45 వేల 581 మందికి పరీక్షలు చేయగా.. 11 వేల 776 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

  • గత కొద్ది రోజుల నుంచి పెరుగుతున్న కేసులు చూస్తే భయం పెడుతోంది. ఈ నెల ఆరంభంలో వేయిలోపే కేసులు నమోదు అయ్యేవి కానీ 20 రోజుల వ్యవధిలో ఆ సంఖ్య 11 వేలను దాటింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • కరోనా బారిన పడి నెల్లూరులో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో చెరో ఇద్దరు మరణించారు.

  • కేవలం 24 గంటల వ్యవధిలో అధికారికంగా మరణించిన వారి సంఖ్య 37కు పెరిగింది. సాధారణంగా బయట పరిస్థితి చూస్తే ఆ లెక్క ఎక్కువే ఉంటోందనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శ్మశాన వాటికల దగ్గర రద్దీ కనిపిస్తోంది.

  • మొత్తం ఐదు జిల్లాల్లో కేసుల ఒక రోజులో నమోదైన కేసుల సంఖ్య వేయి మార్కును దాటింది. దీంతో ఆయా జిల్లా అధికారుల్లో టెన్షన్ పెరుగుతోంది.

  • జిల్లాల వారిగా కేసులు చూస్తే. అనంతపురం జిల్లాలో 1201, చిత్తూరులో 1885, పశ్చిమగోదావరి జిల్లాలో 796 కేసులు నమోదు అయ్యాయి.

  • గుంటూరులో 1593, కపలో 361,కృష్ణాలో 831, కర్నూల్లో 1180, నెల్లూరులో 949 కేసులు నిర్ధారణ అయ్యాయి.

  • ప్రకాశంలో 370, శ్రీకాకుళంలో 1052, విశాఖపట్నంలో 910, విజయనగరంలో 448, పశ్చిమగోదావరి జిల్లాలో 190 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

  • గడిచిన 24 గంటల్లో 4441 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది. ఇప్పటిప వరకు ఏపీ వ్యాప్తంగా 1, 58,80,750 సాంపిల్స్ ను పరిశీలించారు. దీంతో ఏపీ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది.

  • కరోనా ఊహించిన స్థాయిలో విస్తరిస్తుండడంతో కట్టడిపై ఏపీ ప్రభుత్వం పూర్తి ఫోకస్ చేసింది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 11,776 కేసులు నమోదవ్వగా. ఇప్పటి వరకు రెండు దశల్లో కలిపి ఏపీ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10 లక్షల 09 వేల 228కి చేరింది.

  • ఏపీలో తాజాగా పెరుగుతున్న కేసులు చూస్తుంటే.. కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గంలా కనిపిస్తోంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ప్రకటించింది ప్రభుత్వం. అలాగే 18 ఏళ్లు దాటిన వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్