• Neti Charithra

90 మందిని.. బురిఢీ.. కొట్టించిన ముగ్గురు "వనితలు"!

#90 మందిని.. బురిఢీ.. కొట్టించిన ముగ్గురు "వనితలు"!

గిద్దలూరు: నేటి చరిత్ర (నవంబర్26) ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ల్లో రాయితీ రుణాలు ఇప్పిస్తామంటూ 90 మంది ని మోసం చేసిన కేసుల్లో ముగ్గురు మహిళలు.. కటకటాల పాలైన ఘటన గిద్దలూరు లో వెలుగు చూసింది. నిండితులనుంచి రూ.41,21,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ యు.సుధాకరరావు తెలిపారు. వారితో సాన్నిహిత్యంగా ఉంటూ సహకరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం సీఐ వివరాలు వెల్లడించారు. గిద్దలూరు నగర పంచాయతీ మెప్మాలో బీమా మిత్రగా పని చేస్తున్న కొండెపోగు సుజాత, ఆశా కార్యకర్త సూరెపోగు శాంతకుమారి, అంగన్‌వాడీ కార్యకర్త జమ్మలపూడి ఆనమ్మ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లో 50 శాతం రాయితీ రుణాలు ఇప్పిస్తామంటూ పలువురిని నమ్మించారు. రూ.5 లక్షల రుణానికి తమకు రూ.50 వేలు ఇవ్వాలని... రుణ కంతులు చెల్లించకుండానే రూ.2 లక్షలు అందుతుందని మాయమాటలు చెప్పారు. ప్రత్యేక రుణాల కింద ఎస్సీ, ఎస్టీలు కానివారికీ రాయితీ రుణాలు ఇస్తామంటూ ఆశ చూపారు. వీరి మాటలు నమ్మి గిద్దలూరు, రాచర్ల మండలాలకు చెందిన సుమారు 90 మందికి పైగా బాధితులు ఒక్కొక్కరు రూ.50 వేలు చొప్పున ఇచ్చారు.