• Neti Charithra

74 వ అంతరిక్ష ప్రయోగానికి.. కౌంట్ డౌన్!

#74 వ అంతరిక్ష ప్రయోగానికి.. కౌంట్ డౌన్!

శ్రీహరి కోట: నేటి చరిత్ర (నవబర్26) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. బుధవారం చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్‌ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-47ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్‌ నానో ఉపగ్రహాలు రోదసిలోకి పంపించనున్నారు. ఇందులో 12 ఫ్లోక్‌-4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్‌ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉండనుంది. ఇది షార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని.. అంత రీక్ష ప్రయోగం.. విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నారు.

5 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon