• Neti Charithra

73 టన్నుల సబ్సిడీ బియ్యాన్ని.. సీజ్ చేసిన అధికారులు.. కేసు నమోదు!

#73 టన్నుల సబ్సిడీ బియ్యాన్ని.. సీజ్ చేసిన అధికారులు.. కేసు నమోదు!

పశ్చిమ గోదావరి : నేటి చరిత్ర (సెప్టెంబర్17) పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర పౌల్ట్రీ ఫాం లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కొద్ది రోజులుగా ఈ పౌల్ట్రీ ఫార్మ్‌ కు వచ్చే స్టాక్‌ పై నిఘా పెట్టిన అధికారులు..మంగళవారం ఉదయం దాడి చేసి మొత్తం 73 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫౌల్ట్రీ ఫామ్‌ లో ఏర్పాటు చేసిన గూడౌన్‌ లో బియ్యాన్ని దాచి కోళ్లకు మేత గా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ దాడిలో ఇద్దరు అరెస్టు కాగా, మరొక ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ జిల్లా ఎస్పీ వరదరాజులు తో పాటుగా డిఎస్‌పి కెవి.రమణ, సీఐయుజె విల్సన్‌, తహశీల్దార్‌ రమేష్‌ లు పాల్గన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon