• Neti Charithra

73 ఏళ్ళ కు తల్లి కాబోతోంది.. తెలుగు రాష్ట్ర ల్లో అరుదైన ఘటన !

#73 ఏళ్ళ కు తల్లి కాబోతోంది.. తెలుగు రాష్ట్ర ల్లో అరుదైన ఘటన !

విజయవాడ: నేటి చరిత్ర (సెప్టెంబర్5) తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఆమెకు గురువారం వైద్యులు సిజేరియన్‌ చేసి పురుడుపోయనున్నారు. ఐవీఎఫ్‌ స్పెషాలిటీ వైద్య నిపుణుడు, గుంటూరు అహల్యా హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon