• Neti Charithra

6800 మంది కార్యకర్తలతో రాజంపేట జిల్లాలో బిజెపి శ్రేణుల నిరసన..!


6800 మంది కార్యకర్తలతో రాజంపేట జిల్లాలో బిజెపి శ్రేణుల నిరసన..!




మదనపల్లె: నేటి చరిత్ర


అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రధాన్ని తగలబెట్టినదుండగులను వెంటనే అరెస్టు చేయాలని, దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న బిజెపి మరియు హిందుత్వ వాదుల మీద పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకొని

వారిని వెంటనే విడుదల చేయాలని,

మొత్తం వ్యవహారం పైన సి బి ఐ ఎంక్వయిరీ నిర్వహించి అసలు దోషులను బయటికి తీసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ,

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ,

*ఎవరి ఇళ్లలో వాళ్లు ధర్నా లు చేసి నిరసనలు తెలిపారు.

రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు

బిజెపి రాజంపేట జిల్లా అధ్యక్షుడు

డాక్టర్ ఎ.వి.సుబ్బారెడ్డి గురువారం

ఆయన ఇంటిలో నిరసన చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఏ వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీల ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందువుల పట్ల

హిందూ దేవాలయాల పట్ల

హిందూ దేవాలయాల ఆస్తుల పట్ల

పక్షపాత ధోరణి కనపరుస్తూ

పరోక్షంగా హిందువుల మీద

హిందూ ఆలయాల మీద

దాడులకు ప్రోత్సహిస్తున్నట్లు గా అనుమానించ వలసి వస్తుందని ఏ వి సుబ్బారెడ్డి అన్నారు.

ఘటన జరిగిన వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపించి అసలు దోషులను శిక్షించాల్సింది పోయి

దోషులను రక్షిస్తూ

అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు బనాయించడం నీతిమాలిన చర్య అని ఆయన దుయ్యబట్టారు .

వెంటనే జరిగిన ఘటనపై సిబిఐ విచారణ జరిపించి దోషులను శిక్షించాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సంపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవాలని

డాక్టర్ ఎ.వి సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదేవిధంగా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని

బిజెపి రాజంపేట జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి వరుసగా హిందూ దేవాలయాల పైన దాడులు పెరిగిపోయాయని దీని వెనక ఉన్న అసలు దోసులు తప్పించుకోలేరని

కచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పే బాధ్యత బిజెపి తీసుకుంటుందని

ఇప్పటికైనా తమ యొక్క బుద్ధి మానుకోవాలని డాక్టర్ కె వి సుబ్బారెడ్డి హెచ్చరించారు.

హిందువులంతా ఏకమై

హిందూ సంస్థలన్నీ ఒక తాటిపైకి వచ్చి

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందుత్వ సంస్థల పైన కపట ప్రేమను చూపిస్తున్న టువంటి

హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి

పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని,

హిందువులంతా కలసి వచ్చి ఈ రాక్షస శక్తులను అంతమొందించాలని

డాక్టర్ ఏ వి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.

వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించి రథం దహనం చేసినవారిని,

వారి వెనుక ఉన్న అసలు దోషులను,

వారి ఉద్దేశాన్ని బయటికి తీసి,

వారిని శిక్షించాలని ఆయన

డిమాండ్ చేశారు.

ఈరోజు జరిగినటువంటి ధర్నా లో రాజంపేట జిల్లాలోని 42 మండలాలలో,

600 గ్రామాలలో,

మొత్తం ఊర్లలో 6800 మంది

ధర్నాలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు.