• Neti Charithra

60 సంవత్సరాలు నాటి.. కల్యాణ రథోత్సవాన్ని దగ్ధం చేసిన దుండగులు..!


60 సంవత్సరాలు నాటి.. కల్యాణ రథోత్సవాన్ని దగ్ధం చేసిన దుండగులు..!నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


(తూర్పుగోదావరి జిల్లాలో కల్యాణ రథోత్సవం దగ్ధం అవుతున్న దృశ్యం)తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి అపశృతి చోటు చేసుకుంది. 60 ఏళ్ళ క్రితం టేకు కొయ్యతో చేసిన పురాతన కల్యాణోత్సవం రథం దగ్ధం కావటం భక్తులకు ఆవేదనకు గురి చేసింది. స్థానికుల కథనం మేరకు..

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం

సముదాయం లోని కల్యాణోత్సవ రథం దగ్ధం అయింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయింది. అయితే రథానికి మంటలు అంటుకోవడం

ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. ఈ ప్రమాదం తో భక్తులు ఆవేదనకు గురయ్యారు.