• Neti Charithra

50 యేళ్ళ తర్వాత.. హార్సిలీహిల్స్ లో పూర్వపు విద్యార్థుల సందడి!

#50 యేళ్ళ తర్వాత.. హార్సిలీహిల్స్ లో పూర్వపు విద్యార్థుల సందడి!

హార్సిలీహిల్స్: నేటి చరిత్ర (డిసెంబర్15) చిత్తూరు జిల్లా పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ లో 50 యేళ్ళ నాటి పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హార్సిలీహిల్స్ లో ని ఎస్వీ పబ్లిక్ స్కూల్ లో 1965-1972 లో 6 నుంచి 10 వ తరగతి వరకు పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఆనాటి పూర్వపు విద్యార్థుల్లో ఉమ్మడి రాష్ట్రాల చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి , త్రిపుర మాజీ ఐజీ మరియు మాజీ ఎమ్మెల్సీ రెడ్డెప్ప రెడ్డి, అనంతపురం జిల్లా మడక శిర కు చెందిన మాజీ మంత్రి .... తనయుడు సతీష్ , కర్ణాటక రాష్ట్ర అపోలో ఆసుపత్రుల ఇంచార్జ్.. అశోక్ లతో పాటు మరికొందరు లండన్, యునెటెడ్ కింగ్ డమ్, అమెరికా తదితర దేశాల లో ని వివిధ రంగాల్లో వీరు స్థిరపడ్డారు. కాగ 50 యేళ్ళ తర్వాత ఆనాటి పూర్వపు విద్యార్థులు వీరు మళ్ళీ చిన్న నాటి జ్ఞాపకాలను ఆదివారం మళ్ళీ హార్సిలీహిల్స్ లో నెమరేసుకున్నారు. ఆనాడు.. కలిసి చదువుకున్న చదువులు.. కలిసి తిరిగిన ప్రాంతాలు.. ఆనాటి గుర్తులు.. ఒకరి కొకరు.. గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువు ఎం మధుసూదన్ రెడ్డి ని పూర్వపు విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించి.. ఆయన్ను శాలువతో సన్మానించారు. ఆనాటి పూర్వపు విద్యార్థుల మిత్ర బృందం ప్రతినితి మాజీ ఎమ్మెల్సీ రెడ్డెప్ప రెడ్డి మాట్లాడుతూ తాము విద్యా భ్యాసం చేసిన హార్సిలీహిల్స్ అభివృద్ది విషయం లో తమ వంతు కృషి చేస్తామన్నారు.మరో వైపు హార్సిలీహిల్స్ లో పర్యావరణానికి హాని కల్గిస్తున్న నాసిరకం ప్లాస్టిక్ ను పూర్తి స్థాయి లో నిరోధాని కి అలాగే హిల్స్ లో ప్రశాంత మైన గాలి బండ, వ్యూపాయింట్ పరిసరాల్లో మద్యం బాటిళ్లు వినియోగం.. గాజు ముక్కల తో అపరిశుభ్రం గా ఉన్న వాతావరణాన్ని కట్టడి చేసేలా చూడాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తాము కూడా హార్సిలీహిల్స్ కు విచ్చేసే పర్యాటకుల లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రతి ఆరు మాసాలకు.. ఒకసారి తాము పూర్వపు విద్యార్థులు హార్సిలీహిల్స్ లో కలిసేందుకు నిర్ణయించమన్నారు. ఈ కార్యక్రమం లో పూర్వపు విద్యార్థులు

199 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon