- Neti Charithra
50 మంది గ్రామ వలంటీర్లు పై వేటు వేసిన ప్రభుత్వం !

50 మంది గ్రామ వాలంటర్ల పై వేటు వేసిన ప్రభుత్వం !
రాజమండ్రి : నేటి చరిత్ర (ఫిబ్రవరి12)
రాజమహేంద్రవరం రూరల్ పరిధి లోని ధవళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తోన్న 50 మంది వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీవో సుభాషిణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల మూడో తేదీన అత్యవసరంగా నిర్వహించిన రేషన్‌కార్డుల సర్వే విధులకు ధవళేశ్వరంలోని అయిదు గ్రామసచివాలయాలకు చెందిన 50 మంది వాలంటీర్లు హాజరుకాలేదు. ఈమేరకు గ్రామ సచివాలయాల నుంచి తహసీల్దారు ఉన్నతాధికారులకు నివేదిక అందించగా, వారికి కేటాయించిన క్లస్టర్లలో సర్వే తీరుపై జిల్లాస్థాయి అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ల నియామక ఉత్తర్వులలోని మార్గదర్శకాలననుసరించి వారిని విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు ఇచ్చారు.

159 views0 comments