- Neti Charithra
430 ఎకరాలు.. ప్రభుత్వ భూమి..ధారాదత్తం చేసిన ఇద్దరు తహసిల్దార్ లు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..!
430 ఎకరాలు.. ప్రభుత్వ భూమి..ధారాదత్తం చేసిన ఇద్దరు తహసిల్దార్ లు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..!
నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)
తెలంగాణా లోప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టిన ఆరోపణలపై ఇద్దరు తహశీల్దార్లపై వేటు పడింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వే
నంబర్ 540లో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు పట్టాలు చేసిన ఇద్దరు తహశీల్దార్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో గతంలో మఠంపల్లి తహసీల్దార్‌గా పనిచేసి ప్రస్తుతం గరిడేపల్లి తహశీల్దార్‌గా కొనసాగుతున్న చంద్రశేఖర్‌తో పాటు మఠంపల్లి ప్రస్తుత తహశీల్దార్
వేణుగోపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఇద్దరు తహశీల్దార్లు మొత్తం 430 ఏకరాల ప్రభుత్వ భూమిని అక్రమ మ్యూటేషన్ ఇచ్చినట్లు ప్రాథమిక సమాచారం.
372 views0 comments