- Neti Charithra
400 మంది ఏపీ ఉద్యోగుల విషయం లో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం!

400 మంది ఏపీ ఉద్యోగుల విషయం లో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణా ప్రభుత్వం!
అమరావతి: నేటి చరిత్ర
లాక్ డౌన్ లో 60 రోజులుగా
హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. దింతో

తమ ఉద్యోగులను తరలించేందుకు ప్రత్యేక బస్సులకు అనుమతివ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. సుమారు 400 మంది

ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బస్సులకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతినిచ్చింది.
రెండు విడతలుగా వారిని అమరావతికి తరలించే చర్యలు ఏపీ ప్రభుత్వం తీసుకుంటోంది. తొలి విడతగా

250 మందిని తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఒక ఏసీ బస్సుతోపాటు మిగిలినవి సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసింది.
140 views0 comments