• Neti Charithra

35 దేశాల రాయబరులను పిలిపించి.. జగన్ ప్రభుత్వం ఏం.. సాధించింది - పవన్ కళ్యాణ్

#35 దేశాల రాయబరులను పిలిపించి.. జగన్ ప్రభుత్వం ఏం.. సాధించింది - పవన్ కళ్యాణ్

మంగళగిరి: నేటి చరిత్ర (సెప్టెంబర్14) రాష్ట్రం రూ.2.59లక్షల కోట్ల అప్పుల్లో ఉందని జనసేనత అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూౌ పీపీఏలను రద్దు చేసి గందరగోళం సృష్టించారన్నారు. కియా సీఈవోను అవమానించారన్నారు. ఇలా చేస్తే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. 35 దేశాల నుంచి రాయబారులను పిలిపించి ఏం సాధించారు ? అని అన్నారు. పెట్టుబడి దారులను బెదరగొడుతున్నారన్నారు.