• Neti Charithra

34 మంది హెచ్ ఎం లకు మెమోలు జారీచేసిన ప్రభుత్వం..!


34 మంది హెచ్ ఎం లకు మెమోలు జారీచేసిన ప్రభుత్వం..!



తూర్పుగోదావరి: నేటి చరిత్ర


ఏపీ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లాలో 34 మంది ప్రధాన ఉపా

ధ్యాయులకు ప్రభుత్వం మెమో లు

ఇచ్చింది.వివరాల్లోకి వెళితే..

జిల్లాలో ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద

పాఠశాలల్లో చేపట్టిన పనుల ప్రగతిలో వెనకబడిన 34 మంది ప్రధానోపాధ్యాయులకు మెమో జారీ చేసినట్లు డీఈవో ఎస్‌.అబ్రహం తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ మెమోలు జారీ

చేసినట్లు ఆయన తెలిపారు. పనుల్లో ప్రగతి లేకపోవడం, విధుల పట్ల అలసత్వం వహిస్తున్నారనే కారణంపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మెమోకు స్పందించి వివరణ ఇవ్వడంతోపాటు, సరైన ప్రగతి చూపకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


492 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon